Peddhapalli – అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ హయాంలోనే

మంథని:అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంథనిలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ఐడీసీ మాజీ చైర్మన్, మంథని స్థానానికి ఎన్నికల ఇన్ చార్జి ఈద శంకర్ రెడ్డి తెలిపారు. బుధవారం మంథని జెడ్పీ చైర్మన్ భవనంలో అభ్యర్థి పుట్ట మధు సమక్షంలో సంబంధిత మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన 100 మంది, మహాముత్తారం మండలం ములుగుపల్లి గ్రామానికి చెందిన 50 మంది ఈ వేడుకలో పాల్గొని కండువాలు కప్పుకున్నారు. ప్రభుత్వ, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ చేస్తున్న సేవలే ప్రధానాంశంగా పేర్కొంటూ బీఆర్‌ఎస్‌లో చేరాలని సంకల్పించారు.