#National News

Unceasing deaths in Kota.. – కోటాలో ఆగని మరణాలు..

రాజస్థాన్‌(Rajasthan)లోని ప్రముఖ కోచింగ్‌ హబ్‌ కోటా(Kota)లో విద్యార్థుల ఆత్మహత్యలు(suicide) తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కోటాలో మరొక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గత రెండు వారాల్లో ఇది రెండో ఆత్మహత్య. ఈ ఏడాదిలో ఇది 26వ బలవన్మరణం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని(UP) మహువా ప్రాంతానికి చెందిన ప్రియాస్‌ సింగ్‌ ఇంటర్‌ చదివి వైద్య విద్య(NEET UG) అభ్యసించేందుకు కోటాలో శిక్షణ తీసుకుంటోంది. సోమవారం విజ్ఞాన్‌ ఏరియాలోని తన హాస్టల్‌ గదిలో విషం తాగి వాంతులు చేసుకుంది. గమనించిన సహచర విద్యార్థులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రియాస్‌ సింగ్‌ మృతి చెందింది. పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఆమె హాస్టల్‌ గదిలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 

Unceasing deaths in Kota.. – కోటాలో ఆగని మరణాలు..

America has responded to the tensions between

Leave a comment

Your email address will not be published. Required fields are marked *