UGC – వాట్సప్ ఛానల్‌ను ప్రారంభించింది

ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులు, విద్యాసంస్థలకు అందించడానికి వీలుగా యూజీసీ సోమవారం వాట్సప్ ఛానల్‌ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అటు విద్యార్థులకు, ఇటు విద్యాసంస్థలకు రియల్‌టైమ్‌లో సమాచారం అందుతుందని పేర్కొన్నారు.