Traffic in India! – భారతదేశంలో ట్రాఫిక్

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండి ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే నగరాల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మన దేశంలోని భివంఢీ (5వ స్థానం), కోల్‌కతా (6వ స్థానం), ఆరా (7వ స్థానం) నగరాలు ఉన్నాయి. ఇక్కడ అతి నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతుంటుంది. అమెరికాలోని ఎన్‌జీవో జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరో ఈ అధ్యయనం జరిపింది. 152 దేశాల్లోని 1200 నగరాల్లో ట్రాఫిక్‌ను పరిశీలించింది. రోజు మొత్తంలో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసింది. ఇందులో ప్రపంచంలోనే అతి నెమ్మదిగా ట్రాఫిక్ కదిలే నగరాల్లో మూడు మనవేనని తేలింది. అత్యంత వేగంగా ట్రాఫిక్ కదిలే నగరాల్లో అమెరికాలోని ఫ్లింట్ తొలి స్థానంలో నిలిచింది. ఢాకా అత్యంత నెమ్మదిగా ట్రాఫిక్ కదిలే నగరంగా ఉంది. అత్యంత ఇరుకైన నగరంగా కొలంబియాలోని బొగొటా నిలిచింది. నెమ్మదిగా వాహనాలు కదిలే నగరాల్లో బిహారీ షరీఫ్ 11వ స్థానంలో, ముంబయి 13వ స్థానంలో, ఐజ్వాల్ 18వ స్థానంలో, బెంగళూరు 19వ స్థానంలో, షిల్లాంగ్ 20వ స్థానంలో నిలిచాయి. ఇరుకుగా ఉండే నగరాల్లో బెంగళూరు 8వ స్థానంలో, ముంబయి 13వ స్థానంలో, దిల్లీ 20వ స్థానంలో నిలిచాయి. పేద దేశాల్లోని సరాసరి వాహనాల వేగం కంటే ధనిక దేశాల్లో వేగం 50శాతం అధికంగా ఉంది. నెమ్మదిగా ట్రాఫిక్ కదిలే 10 నగరాలు బంగ్లాదేశ్, భారత్, నైజీరియాల్లోనే ఉన్నాయి.