There’s no improvement.. – ఎలాంటి మెరుగుదల లేదు..

స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొమ్మిదేళ్లవుతున్నా ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత ఏమీ మెరుగుపడలేదని దేశంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి మహా నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక మాధ్యమ వేదిక దేశవ్యాప్తంగా 341 జిల్లాల్లో ఈ సర్వేను చేపట్టింది. 39 వేలకుపైగా మంది అభిప్రాయాలను తెలుసుకుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం తమ నగరం/జిల్లాలో ప్రజా మరుగుదొడ్లు మెరుగయ్యాయని, లభ్యత పెరిగిందని 42% మంది పేర్కొన్నారు. అలాంటి మెరుగుదల ఏదీ లేదని ఏకంగా 52% అభిప్రాయపడ్డారు.