‘That credit is ours’ said Sonia Gandhi – ‘ఆ క్రెడిట్ మాదే’ అన్నారు సోనియా గాంధీ

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటు భవనం వద్దకు వస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేఖరులు ఆమె స్పందన కోరగా ఈ బిల్లు మాదేనని అన్నారు. 2010లో కాంగ్రెస్ అదిఆకారంలో ఉన్నపుడు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని బిల్లులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీలకే దక్కుతుందని అన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం.