Sourav Ganguly entered the business sector – సౌరవ్ గంగూలీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు

పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) చేరాడు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)తో పాటు సౌరభ్ గంగూలీ ప్రస్తుతం స్పెయిన్ (Spain) పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్‌లో మూడో స్టీల్ పరిశ్రమను ప్రారంభించబోతున్నాను. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. నేను కేవలం క్రికెట్ ఆడతానని మనలో చాలామందికి తెలుసు. కానీ మేము 2007లో ఒక చిన్న స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించాం. ఐదారు, నెలల్లో మేదినీపుర్‌లోని సల్బోనిలో మరో కొత్త స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అంతేకాకుండా 55 ఏళ్ల కిందట మా తాత ప్రారంభించిన వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మద్దతుగా నిలిచింది ’ అని ఆయన తెలిపారు.