Range Rover: బంపర్ ఆఫర్.. ₹100కే

అస్సాం(Assam) లోని హౌలీలో ఏటా నిర్వహించే రాస్ ఫెస్టివెల్(Raas Festival) సందర్భంగా నిర్వహించే లాటరీ(Lottery)లో ఈ సారి ఖరీదైన బహుమతులను అందివ్వనున్నట్లు నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా కేవలం వంద రూపాయలకే రూ.76 లక్షలు విలువచేసే రేంజ్‌రోవర్(Range Rover) కారును ప్రథమ బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే ఈ కారును ఎలా గెలుచుకోవాలో చూద్దాం..
అస్సోంలోని హౌలీలో రాస్ పండగను నిర్వహిస్తారు. ఏళ్ల నాటిగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా పండగకు ముందు లాటరీ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఏటా నిర్వహించే ఈ లాటరీ ఈవెంట్‌లో గెలిచిన వారికి కార్లను అందించనున్నారు. మొదటి బహుమతి కింద రూ.76 లక్షల రేంజ్ రోవర్, తర్వాత బహుమతుల కింద రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, స్కోడా కుచక్, నెక్సాన్ వంటివి ఉన్నాయి.
ఒక్కో లాటరీ టిక్కెట్ ధరను రూ.100గా నిర్ణయించారు. అయితే ఈ లాటరీ విషయం తెలియగానే వాటిని కొనుగోలు చేయటానికి హౌలీలోని గిఫ్ట్ కూపన్ కార్యాలయాలకు జనం బారులు తీరుతున్నారు. ఈ విజేతలను డిసెంబరు 10న ప్రకటించనున్నారు. గతేడాది నిర్వహించిన ఈవెంట్‌లో మొదటి బహుమతి కింద ఆడి కారును ఇచ్చారు. గువహాటికి చెందిన జనార్దన్ బోరో అనే అస్సోం పోలీసు అధికారి దీనిని గెలుచుకున్నారు. 2022లో లాటరీ కమిటీ 3.2 లక్షల టిక్కెట్లను విక్రయించింది. ఈ ఏడాది 4 లక్షల టిక్కెట్లను విక్రయించనుంది.