#National News

Ram Mandir – ప్రారంభానికి మోదీకి ఆహ్వానం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ బుధవారం ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి కోవెలను ప్రారంభించనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు. ‘‘ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రారంభం నేపథ్యంలో అయోధ్యకు రావల్సిందిగా నన్ను ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా జీవితకాలంలో ఈ చరిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం’’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *