Railways : కొత్త టైంటేబుల్ విడుదల

ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన రైళ్ల కొత్త టైంటేబుల్‌ను(Railways New TimeTable) రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. 64 కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు, మరో 70 ఇతర రైళ్ల సేవలను దీనిలో చేర్చారు. వివిధ నగరాల మధ్య అనుసంధానాన్ని పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించేలా సమయ పట్టికను రూపొందించినట్లు రైల్వేశాఖ తెలిపింది. 90 రైళ్ల గమ్యస్థానాలను మార్చడం, 12 రైళ్లు నడిచే రోజులను పెంచడం, 22 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌లుగా నడపనుండడం వల్ల రాకపోకల సమయాలను ప్రయాణికులు ముందుగా సరిచూసుకోవాలని సూచించింది. రైల్వే అధికారిక వెబ్‌సైట్లోనూ ఈ వివరాలు లభ్యమవుతాయని తెలిపింది.