Rahul Gandhi : “రాహుల్ గాంధీ అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో”

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా రెండో రోజూ (మంగళవారం) అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు చేశారు. తలకు నీలిరంగు వస్త్రం ధరించిన ఆయన.. వంటశాలలో కూరగాయలు తరిగారు. అనంతరం భక్తులకు ఆహారం వడ్డించారు. పాత్రలను శుభ్రం చేయడంతోపాటు పాదరక్షల కేంద్రంలో కూడా సేవ చేశారు.