#National News

Chandrababu Babu – అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నిరసనలు జరిగాయి

చంద్రబాబు అక్రమ అరెస్టుపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కర్ణాటకలోని విజయనగర జిల్లా కేంద్రంలో కమ్మ సంఘం కార్యాలయం నుంచి జయప్రకాశ్‌నగర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. తెలుగు సంఘం అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాస్‌, కార్యదర్శి జి.నాగబ్రహ్మేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని పళ్లిపట్టు బస్టాండు వద్ద ఆందోళన నిర్వహించారు. తమిళనాడు తెలుగు భాషా సంరక్షణ సంఘ అధ్యక్షుడు ఎన్‌.రాజేంద్రనాయుడు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *