PM Modi’s response to the Israel Embassy.. – ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై ప్రధాని మోదీ స్పందన..

సెప్టెంబరు 14న హిందీ దినోత్సవాన్ని (Hindi Diwas) పురస్కరించుకుని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయ (Israeli embassy) ప్రతినిధులు ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను మెచ్చుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi) రిప్లై ఇచ్చారు.
గురువారం హిందీ దివస్ సందర్భంగా హిందీ భాష ప్రత్యేకతను తెలుపుతూ ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయ అధికారులు పలు ప్రముఖ హిందీ సినిమా డైలాగులను (Hindi film dialogues) చెబుతూ వీడియోను ఎక్స్(ట్విటర్)లో పంచుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ వారిని అభినందించారు. సంప్రదాయం, ప్రతిష్ఠ, క్రమశిక్షణ వంటి వాటితో మూడు స్తంభాలుగా ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధులకు నా హృదయపూర్వక అభినందనలు. హిందీ సినిమా డైలాగులతో హిందీ భాష గొప్పతనాన్ని తెలుపుతూ మీరు చేసిన ప్రయత్నం ఎంతో ఆకట్టుకుంది’ అని మోదీ అన్నారు.
ప్రతి ఏడాది సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ట్వీట్ చేస్తూ.. ‘ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష భారతదేశానికి ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. దాని సరళత, సహజత్వం, సున్నితత్వం ఎప్పుడూ ఆకర్షిస్తాయి. అది సాధికారత సాధించడానికి విరామం లేకుండా సహకరించిన ప్రజలందరికీ హిందీ దివస్ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని తెలిపారు.