#National News

పార్లమెంట్‌ పాత భవనానికి వీడ్కోలు పలికిన ఎంపీలు – MPs bid farewell to the old Parliament building

స్వతంత్ర భారత్‌లో చోటుచేసుకున్న ఎన్నో కీలక ఘట్టాలకు పాత పార్లమెంట్‌ సాక్షిగా మిగలనుంది. మరికొన్ని గంటల్లో చట్టసభల కార్యకలాపాలు కొత్త భవనం(parliament new building)లోకి మారనున్నాయి. ఈ సమయంలో పాత భవనం జ్ఞాపకాలను పదిలపరుచుకునే ఉద్దేశంతో ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. వారంతా దీనికోసం మంగళవారం ఉదయం పాత పార్లమెంట్‌ ప్రాంగణానికి వచ్చారు. (Parliament Special Session)

మొదట ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ఫొటోకు పోజు ఇచ్చారు. తర్వాత రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు విడివిడిగా ఫొటో దిగారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ(Modi), లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ తదితరులు ముందు వరుసలో కూర్చున్నారు. ఉపరాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ మధ్యలో మోదీ కూర్చొని కనిపించారు.

ఈ ఫొటో తర్వాత ఉదయం 11.30 గంటలకు పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో ఎంపీలు భేటీ అవుతారు. అక్కడ అన్ని లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌, మంత్రులు, ఎంపీలు కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్తారు. సెంట్రల్‌ హాల్‌లో ఉన్న రాజ్యాంగ పుస్తకాన్ని మోదీ స్వయంగా తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత కొత్త భవనంలో లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 1.15కి ప్రారంభం కానున్నాయి. అలాగే రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2.15 మొదలవుతాయి. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *