#National News

Mumbai-Ahmedabad – హైస్పీడ్‌ రైలు తొలి సొరంగం తవ్వకం

దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో భాగంగా గుజరాత్‌లోని జరోలీ గ్రామంలో 350 మీటర్ల పొడవైన పర్వత సొరంగం తవ్వకం పనులను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. 508 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో ద నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌  మరో ఆరు సొరంగాలను తవ్వేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పూర్తిస్థాయిలో ఈ మార్గం అందుబాటులోకి వస్తే 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ రైలు పరుగులు తీయనుంది. ఇక ఇదే మార్గంలో ఉన్న సూరత్‌లో జాతీయ రహదారి 53పై తొలి ఉక్కు వంతెన నిర్మాణాన్ని సైతం పూర్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *