Movements- పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్తున్న

పంజాబ్ రాష్ట్రం లుథియానాలో చనిపోయాడనుకొని పోస్ట్‌మార్టంకు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి దేహంలో కదలికలను చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. ఆయన్ను మరో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పోలీసు అధికారి మన్‌ప్రీత్‌ను ఓ విషపురుగు కుట్టింది. సెప్టెంబరు 15న ఆయనను లుథియానాలోని బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు. శరీరమంతా ఇన్‌ఫెక్షను సోకడంతో వెంటిలేటరుపై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 18 అర్ధరాత్రి మన్‌ప్రీత్ మృతిచెందాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపారని తండ్రి రామ్‌జీ చెబుతున్నారు. మరుసటిరోజు ఉదయం పోస్ట్‌మార్టం కోసం తరలిస్తుండగా అక్కడే డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి.. మన్‌ప్రీత్ శరీరంలో కదలికలను గుర్తించారు. వెంటనే మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, మన్‌ప్రీత్ చనిపోయాడని తమ సిబ్బంది ఎవరూ చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు అంటున్నారు.