#National News

IT Raids: కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు.

కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు(IT Raids) చేపట్టారు. దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ దాడుల్లో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ గుత్తేదార్లు, బిల్డర్లు, నగల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో ఆదాయ పన్నుశాఖ జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) సోమవారం వెల్లడించింది. కర్ణాటక, దిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో మొత్తంగా 55 చోట్ల అక్టోబర్‌ 12 నుంచి కొనసాగించిన ఐటీ దాడుల్లో ₹94 కోట్ల నగదుతో పాటు రూ.8కోట్ల విలువచేసే బంగారం, వజ్రాభరణాలు, 30 లగ్జరీ వాచ్‌లను స్వాధీనం చేసినట్టు తెలిపింది. దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ దాడుల్లో లెక్కల్లోకి రాని రూ.94 కోట్ల నగదు, బంగారం, వజ్రాభరణాలు సీజ్‌ చేసినట్టు ప్రకటనలో పేర్కొంది. నగదుతో పాటు సీజ్‌ చేసిన వస్తువుల విలువ మొత్తంగా రూ.102 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే,  చేతి గడియారాల వ్యాపారంతో సంబంధం లేని ఒక ప్రైవేట్ ఉద్యోగి నివాసంలో 30 విదేశీ రిస్ట్‌ వాచ్‌లను సీజ్‌ చేసినట్టు సీబీడీటీ పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *