#National News

International Constitution Day was celebrated on Friday by the Karnataka government – కర్ణాటక ప్రభుత్వం అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించింది

అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు.

బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జూన్‌లో ఉత్వర్వులు జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *