#National News

Tensions between India and Canada are getting darker – భారత్‌, కెనడా (India-Canada) మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని ఆరోపించిన కెనడా.. ఆ దేశంలోని మన రాయబారిపై బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్‌.. కెనడాకు గట్టిగా బదులిచ్చింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ (MEA) వెల్లడించింది.

భారత్‌కు కెనడా హైకమిషనర్‌ అయిన కామెరూన్‌ మెక్‌కేకు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) నేడు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ ఉదయం ఆయన దిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో గల విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లోని సీనియర్‌ కెనడియన్‌ దౌత్యవేత్తను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విదేశాంగ శాఖ.. కెనడా హైకమిషనర్‌కు తెలిపింది. ఐదు రోజుల్లోగా ఆ దౌత్యవేత్త దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ‘‘మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఆ దౌత్యవేత్తను బహిష్కరించాం’’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ఈ ఉదయం విదేశాంగ కార్యాలయానికి వచ్చిన కెనడా హైకమిషనర్‌ కామెరూన్‌.. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆఫీసు నుంచి బయటకు వచ్చిన ఆయన్ను విలేకరులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. కామెరూన్‌ వారిని పట్టించుకోకుండా వేగంగా వెళ్లిపోయారు.

ఈ ఏడాది జూన్‌లో హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (45) కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో నిన్న ఆ దేశ పార్లమెంట్ వేదికగా అనుమానాలు వ్యక్తం చేశారు. అనంరతం కొద్ది గంటలకే కెనడాలో భారత రాయబారిపై బహిష్కరణ వేటు పడింది.

Tensions between India and Canada are getting darker – భారత్‌, కెనడా (India-Canada) మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి

Governor Tamili Sai performed the first Maha

Leave a comment

Your email address will not be published. Required fields are marked *