#National News

IIT Bombay : వెజ్‌ – నాన్‌వెజ్‌ వివాదం

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో కొద్ది నెలల క్రితం తలెత్తిన వెజ్‌ – నాన్‌వెజ్‌ వివాదాన్ని అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. వసతిగృహంలో నిరసన తెలిపిన విద్యార్థుల్లో ఒకరికి ఇన్‌స్టిట్యూట్‌ మెస్‌ కౌన్సిల్‌ రూ.10 వేల జరిమానా విధించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. అక్టోబరు 1న సమావేశమైన మెస్‌ కౌన్సిల్‌ శాకాహార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆరు టేబుళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఆ టేబుళ్లపై వెజ్‌ భోజనం మాత్రమే చేయాలని విద్యార్థులకు పంపిన ఈ-మెయిల్‌లో స్పష్టం చేసింది. గత జులైలో ఈ వివాదం రాజుకుంది. వసతిగృహం క్యాంటీన్‌లో మాంసాహారం తిన్నందుకు ఓ విద్యార్థిని కొందరు విద్యార్థులు అవమానించారు. క్యాంటీన్‌ గోడలపై ‘వెజిటేరియన్లు మాత్రమే ఇక్కడ కూర్చోడానికి అర్హులు’ అని రాసిన పోస్టర్లను అతికించి, సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. దీంతో మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్‌లో వివక్ష చూపుతున్నారని పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *