Heart Attack : ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగితే

ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ఉత్తర భారత్ సహా తూర్పు పాకిస్థాన్‌లోని ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ నివేదిక వెల్లడించింది. దీని వల్ల దాదాపు 220 కోట్ల మంది ప్రజలు అతి తీవ్ర వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ నివేదికను ప్రచురించింది. ఈ అతి తీవ్రమైన వేడి వల్ల మానవుల్లో వడదెబ్బ, గుండెపోటుతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతంతో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగినా.. ఏటా వందల కోట్ల మంది తీవ్ర వేడి, గాల్లో అధిక తేమతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఫలితంగా వారు సహజసిద్ధంగా తమ శరీరాన్ని చల్లబరచుకోలేని పరిస్థితి తలెత్తుతుందని వివరించింది.