Hamas Attack – ఇద్దరు భారత భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల్లో భారత సంతతికి చెందిన కనీసం ఇద్దరు భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరినీ లెఫ్టినెంట్ ఓర్ మోజెస్ (22), పోలీసు ఇన్‌స్పెక్టర్ కిమ్ డొక్రాకెర్‌లుగా గుర్తించారు. విధి నిర్వహణలో వీరిద్దరూ ప్రాణత్యాగం చేసినట్లు బయటపడింది. ఇంతవరకు 286 మంది సైనికులు, 51 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తేల్చారు. మృతులను, అపహరణకు గురైనవారిని గుర్తించే పని కొనసాగుతున్నందువల్ల ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.