#National News

Growing crops – నీళ్లు లేకుండా పంటలు పండిస్తున్నారు

వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే రైతులకు తన ఆవిష్కరణతో మార్గం చూపించాడో యువకుడు. మొక్కజొన్నతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే మరో పదార్థంతో ఓ మిశ్రమాన్ని తయారు చేశాడు మహారాష్ట్ర జల్‌గావ్‌ జిల్లాలోని బ్రాహ్మణ్‌షెవ్‌గే గ్రామానికి చెందిన ప్రకాశ్‌ సునీల్‌ పవార్‌. దీని సాయంతో సుమారు రెండు నెలల వరకు నీటి లభ్యత లేకున్నా పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. లేత ఆకుపచ్చ రంగులో ఉండే.. ఈ పేస్ట్‌ను మొక్కల వేర్ల పైభాగంలోని మట్టిలో కలపాలని ప్రకాశ్‌ చెబుతున్నాడు. ఇలా కలిపిన చోట.. 45 నుంచి 60 రోజుల పాటు నీరు లేకపోయినా పంటలు ఎండకుండా ఉంటాయని వివరిస్తున్నాడు. ఈ ఆవిష్కరణపై 20 ఏళ్ల పాటు పేటెంట్‌ హక్కులను పొందినట్లు ప్రకాశ్‌ వెల్లడించాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *