Good news to the Bengali people – బెంగాలీ ప్రజలకు శుభవార్త

బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పద్మాపులస(హిల్సా)ను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇళ్లలో హిల్సాను వండుకొని తింటారు. ఈ నేపథ్యంలో దాదాపు 4వేల మెట్రిక్ టన్నుల పద్మాపులసలను భారత్‌లో విక్రయించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బెంగాల్‌లో గురువారం నుంచి పద్మాపులస రాక ప్రారంభమైంది. సాధారణంగా కోల్‌కతా మార్కెట్లలో కిలో హిల్సా ధర దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో పుట్టే చేపలు కాబట్టే వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది. కొంత మంది బెంగాల్ ప్రజలు వీటిని పూజల్లో నైవేద్యంగా సమర్పిస్తారు.