#National News

Former CEC – ఎం.ఎస్‌.గిల్‌ కన్నుమూత

కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ మనోహర్‌ సింగ్‌ గిల్‌ (86) దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. సోమవారం దిల్లీలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితవర్గాలు తెలిపాయి. 1996 డిసెంబరు నుంచి 2001 జూన్‌ మధ్య ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా పనిచేశారు.  సీఈసీగా పనిచేశాక రాజకీయరంగ ప్రవేశం చేసిన తొలి వ్యక్తిగా  గిల్‌ను చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టిన ఆయన 2008 నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర క్రీడల మంత్రిగా పనిచేశారు. 2000లో ‘పద్మవిభూషణ్‌’ అందుకొన్న గిల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *