Empowerment with reservation – స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో సాధికారత.

మహిళలకు రిజర్వేషన్లు భారీ మేలే చేస్తున్నాయి. 3 దశాబ్దాల కిందట తెచ్చిన పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్లు వారిని సాధికారత దిశగా నడిపించాయి. ఇప్పుడు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లు వారికి మరింత ఊతమివ్వనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రిసామా గ్రామ పంచాయతీ సర్పంచి గీతా మహానంద్‌నే తీసుకోండి. గృహిణిగా జీవితం వెళ్లదీసే ఆమె పంచాయతీరాజ్ రిజర్వేషన్ల పుణ్యమా అని సర్పంచి అయ్యారు. ఆ రిజర్వేషన్లు లేకుంటే తాను ఇంటికి పరిమితమయ్యేదానినని ఆమె అంటున్నారు. రిజర్వేషన్లు తనను సాధికారత దిశగా నడిపించడమే కాదని, నిర్ణయాలు తీసుకునే శక్తినిచ్చిందని, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న విశ్వాసాన్ని కల్పించిందని ఆమె చెబుతున్నారు. 3 దశాబ్దాల కిందట తీసుకొచ్చిన రిజర్వేషన్లు మహిళలపట్ల లింగ వివక్షను తగ్గించడంలో తోడ్పడ్డాయి. క్షేత్ర స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశమిచ్చాయి.