Dussehra – మైసూరులో దసరా ఉత్సవాలు

రాచనగరి మైసూరులో ఆదివారం దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చాముండి బెట్టపై అమ్మవారి ఉత్సవమూర్తికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రత్యేక అతిథి, ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ పూజలు చేశారు. నంది ధ్వజానికి పూజ చేసి 414వ ఉత్సవాలను ప్రారంభించారు. అంబా ప్యాలెస్ ఆవరణలో రాజ వంశస్థుడు యదువీర కృష్ణదత్త ఒడెయరు బంగారు సింహాసనానికి పూజ చేశారు. సింహాసనంపై కూర్చుని ప్రైవేటు దర్బారు నిర్వహించారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను యువత అనుసరించేలా దసరాను నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. మైసూరు, కొడగు, శ్రీరంగపట్టణ, మంగళూరు, ఉడుపి, చామరాజనగర జిల్లాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద ఏకకాలంలో సంబరాలు మొదలయ్యాయి. 23న విజయదశమి, 24న జంబూ సవారీతో వేడుకలు ముగుస్తాయి. ఉత్సవాల కోసం రాచనగరిని విద్యుత్తు దీపాలతో అలంకరించారు.