“Didi Was Seen Jogging In A Saree” – “దీదీ చీరలో జాగింగ్ చేస్తూ కనిపించారు”

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివిధ సందర్భాల్లో తెలియజేశారు. ప్రస్తుతం స్పెయిన్ పర్యటనలో ఉన్న దీదీ.. మాడ్రిడ్‌లోని ఒక పార్కులో తన బృందంతో కలిసి జాగింగ్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీదీ తెల్ల చీర ధరించి, రబ్బరు చెప్పులతో జాగింగ్ చేశారు. ‘‘ప్రతి రోజు ఉదయాన్నే జాగింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వ్యాయామం మీకు శక్తినిస్తుంది. అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి’’ అని మమత రాసుకొచ్చారు