#National News

Diabetes – 14 రోజుల్లోనే నియంత్రణ!

భారత్‌లో మధుమేహ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యకర జీవనశైలి, ఆహారం, మధుమేహాన్ని నియంత్రించే లక్షణాలు కలిగిన బీజీఆర్‌-34 వంటి మూలికా ఔషధాలతో రక్తంలో చక్కెర స్థాయిని 14రోజుల్లోనే నియంత్రించొచ్చని వారు గుర్తించారు. పట్నాకు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా.. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిపై వారు దృష్టి సారించారు. అతడికి రెండు వారాల పాటు బీజీఆర్‌-34, ఆరోగ్యవర్ధిని వాతి, చంద్రప్రభావతి వంటి ఆయుర్వేద ఔషధాలు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు, జీవనశైలిలో సర్దుబాట్లు, నిర్దిష్ట ఆహారాన్ని సూచించారు. 14 రోజుల తర్వాత చికిత్సలో స్వల్ప మార్పు చేశారు. ఈ సమయంలో రోగి పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. చికిత్సకు ముందు అతడిలో చక్కెర స్థాయి.. పరగడుపున 254 ఎంజీ/డీఎల్‌గా ఉండేది. చికిత్స తర్వాత అది 124 ఎంజీ/డీఎల్‌కు తగ్గింది. గతంలో.. అల్పాహారం తీసుకున్నాక అతడిలో చక్కెర స్థాయి 413గా ఉండేది. చికిత్స తర్వాత 154 ఎంజీ/డీఎల్‌కు అది తగ్గింది. ఈ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, అందువల్ల మరింత విశ్లేషణ కోసం విస్తృత అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Diabetes – 14 రోజుల్లోనే నియంత్రణ!

Nepal – భారీ భూకంపం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *