Clashes in Madhya Pradesh.. – మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ..

త్వరలో మధ్యప్రదేశ్‌లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో వినాయక చవితి సందర్బంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలంతా కలిసి అధికార బీజీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘జన ఆక్రోశ యాత్ర’కు శ్రీకారం చుట్టారు.
ఒకపక్క బీజేపీ పార్టీ జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,500 కిలోమీటర్లు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. వారికి దీటుగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యాత్రను ప్రారంభించినట్లు తెలుస్తోంది.15 రోజులపాటు నిర్దేశించిన ఈ యాత్త్ర 11,400 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాల్లోనూ కొనసాగుతుందని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు..
యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా.గోవింద్ సింగ్, అజయ్ సింగ్, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ పచౌరీ, కాంతిలాల్ భూరియా, అరుణ్ యాదవ్, మాజీ మంత్రులు జీతూ పట్వారీ కమలేశ్వర్ పటేల్ రాధా సారధులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని ముఖ్య కేంద్రాల్లో పూజలు ముగిశాక ఆయా ముఖ్య నేతలు ఈ యాత్రలను ప్రారంభించారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ మాట్లాడుతూ.. వినాయాక చవితి సందర్బంగా ఈ జన ఆక్రోశ యాత్రలు ప్రారంభమవుతున్నాయని శివరాజ్ సింగ్ చొహాన్ ప్రభుత్వ పాలనలో 18 ఏళ్ల పాటు అణగారిన వర్గాల బాధలను తెలియజేయడమే ఈ యాత్రల ముఖ్య ఉద్దేశ్యమన్నారు.