Child born with 26 fingers.. – 26 వేళ్లతో జన్మించిన చిన్నారి..

రాజస్థాన్(Rajasthan)లో ఓ మహిళ సోమవారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారికి పుట్టుకతోనే 26 వేళ్లున్నాయి. ఇలా 26 వేళ్లతో పుట్టడం చాలా అరుదైన సందర్భాల్లోనే జరుగుతుంది. జెనెటిక్ డిజార్డర్(genetic desorder) వల్లే ఇలా జరుగుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. మరోవైపు తాము పూజించే దేవత తమ ఇంట్లో పుట్టిందని కుటుంబ సభ్యులు ఆనంద పడిపోతున్నారు.
రాజస్థాన్‌లోని దీగ్ జిల్లాలో ఓ మహిళ ఆదివారం రాత్రి అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ చిన్నారి రెండు చేతులకు 7 వేళ్లు చొప్పున, కాళ్లకి 6 వేళ్లు చొప్పున మొత్తం 26 వేళ్లు ఉన్నాయి. ఇన్ని వేళ్లతో జన్మించడం అరుదైన సందర్భాల్లోనే చూస్తుంటాం. దీన్ని వైద్య భాషలో పాలీడాక్టిలీ అంటారు. ఇలా పుట్టడం అరుదైన విషయం అయినప్పటికీ దీనివల్ల చిన్నారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు తెలిపారు. అయితే ఆ చిన్నారి తాము పూజించే దోల్‌గఢ్ దేవతా అవతారమని నమ్ముతున్నట్లు ఆ శిశువు తాత తెలిపాడు.