#National News

Chandrayaan-3 – భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నిర్వహించిన మహా క్విజ్ పోటీ.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్వహిస్తున్న చంద్రయాన్‌-3 మహా క్విజ్‌ పోటీల్లో పాల్గొనాలని ఆ సంస్థ ఛైర్మన్‌ డా.సోమనాథ్‌ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ పరిశోధనలపై భారతీయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 16 లక్షల మంది భారతీయులు ఇందులో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రశంసాపత్రంతోపాటు నగదు బహుమతి ఇస్తున్నారు.

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఆధ్వర్యంలో అక్టోబరు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించనున్నట్లు షార్‌ సంచాలకులు రాజరాజన్‌ తెలిపారు. ఈ సారి షార్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోని 8 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతరిక్ష ప్రదర్శనలతోపాటు, సీనియర్‌ శాస్త్రవేత్తల ఉపన్యాసాలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. విద్యార్థులకు క్విజ్‌, డ్రాయింగ్‌ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని సంగం, చిల్లకూరు మండలంలోని చింతవరం, వరదయ్యపాళెంలో అక్టోబరు 5, 6, 7, 9వ తేదీల్లో ఇస్రో ప్రయోగాలపై ప్రదర్శన, అంతరిక్ష ప్రయోగాలపై ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. ఒకరోజు శ్రీహరికోటలో విద్యార్థుల సందర్శనకు అనుమతిచ్చి, సౌండ్‌ రాకెట్‌ ప్రయోగం వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *