Avoid Falling For Paid Sample Paper Scams – పెయిడ్ శాంపిల్ పేపర్స్ మోసాలపై జాగ్రత్త

తాము ఏ ప్రైవేటు ప్రచురణ సంస్థతోనూ 10, 12 తరగతులకు సంబంధించిన పెయిడ్ శాంపిల్ పేపర్స్‌పై ఒప్పందం చేసుకోలేదని, ఎవరైనా అటువంటి ప్రచారం చేస్తే నమ్మవద్దని సీబీఎస్‌ఈ(CBSE) స్పష్టం చేసింది. ఎడ్యుకార్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది. కొన్ని పాఠశాలలకు అటువంటి విజ్ఞప్తులు వస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని, మోసపోవద్దని సూచించింది.