#National News

Abhishek Singh : సినిమాలపై మక్కువతో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా

ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అభిషేక్‌ సింగ్‌ సినిమాలపై మక్కువతో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని  ధ్రువీకరించారు. నటన, మోడలింగుపై ఉన్న ఆసక్తితో అభిషేక్‌ ఇప్పటికే కొన్ని సినిమాలకు పనిచేశారు. సర్వీసులో ఉండగా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి డిప్యుటేషనుపై దిల్లీకి వెళ్లారు. ఉన్నతాధికారులు ఆ వ్యవధిని 2018లో మరో రెండేళ్లు పెంచారు. అభిషేక్‌ ఆ సమయంలో మెడికల్‌ లీవ్‌ తీసుకొని విధులకు దూరంగా ఉన్నారు. ఈ కారణంగా దిల్లీ ప్రభుత్వం 2020 మార్చిలో ఆయన్ను సొంత రాష్ట్రానికి పంపింది. అయినా వెంటనే విధుల్లో చేరకుండా.. సరైన కారణం చెప్పకుండా.. మూడు నెలల తర్వాత జూన్‌లో విధుల్లో చేరారు. గతేడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన అభిషేక్‌.. తానే పరిశీలకుడినని తెలిపే ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈసీ ఎన్నికల విధుల నుంచి తప్పించింది. విధుల్లో నిర్లక్ష్యం చూపారన్న కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిషేక్‌ సస్పెండ్‌ అయ్యారు. ఈయన సతీమణి శక్తి నాగ్‌పాల్‌ కూడా ఐఏఎస్‌ అధికారే. అభిషేక్‌కు ఇన్‌స్టాగ్రాంలో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *