#National News

A six-year-old boy is breaking records – ఆరేళ్ల బాలుడు రికార్డులు బద్దలు కొడుతున్నాడు

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన లక్ష్య అగర్వాల్‌ (6) అనే బాలుడు జాతీయజెండాను చేతబూని 11.77 కిలోమీటర్ల పరుగును రెండు గంటలా ఏడు నిమిషాల్లో పూర్తిచేసి ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించాడు. లాడ్‌పుర్‌ వాసి అయిన ఈ బాలుడు గత ఆగస్టు 15న విక్రం చౌక్‌ నుంచి కోటాలోని షహీద్‌ స్మారక్‌ వరకు పరుగు తీశాడు. ఇది ఆరేళ్ల వయసు గల బాలుడు పరుగుతీసిన గరిష్ఠ దూరం కావడంతో రికార్డులు వరించాయి. ఒకటో తరగతి చదువుతున్న లక్ష్య అగర్వాల్‌ రికార్డుల ధ్రువపత్రాలు చేతికి అందాక కుటుంబసభ్యులతో వేడుక జరుపుకొన్నాడు. లక్ష్య తండ్రి అంకిత్‌ అగర్వాల్‌ పేరిట కూడా పరుగు, సైక్లింగు రికార్డులు ఉన్నాయి. లక్ష్య కంటే పెద్దవాడైన సోదరుడు భవ్య సైతం సైక్లింగు, దేశభక్తితో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించాడు.

A six-year-old boy is breaking records – ఆరేళ్ల బాలుడు రికార్డులు బద్దలు కొడుతున్నాడు

Women’s Reservation Bill In The Parliament –

Leave a comment

Your email address will not be published. Required fields are marked *