Uttar Pradesh – ఆగ్రాలో డ్రైవర్ లేకుండా ఓ కంటైనర్ ట్రక్ రోడ్డుపై

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటెయినర్ ట్రక్కు డ్రైవరు లేకుండానే రోడ్డుపై పరుగులు పెట్టింది. ట్రాన్స్ యమునా పోలీస్‌స్టేషను పరిధిలోని టెఢీ బగియా కూడలి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పని మీద కిందకు దిగిన ట్రక్కు డ్రైవరు హ్యాండ్‌బ్రేక్ వేయడం మరచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు లేకుండా రోడ్డుపై కదులుతున్న లారీని చూసిన జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ట్రక్కు ఢీకొని రోడ్డు పక్కన ఉంచిన రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసమవగా.. కొంతమంది ద్విచక్ర వాహనదారులతోపాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. చిన్నారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.