#Cinema #Movies

SSMB29 : Rajamouli’s remuneration for Mahesh Babu’s movie? మహేశ్‌ బాబు సినిమా కోసం రాజమౌళి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?

మహేశ్‌ బాబు-  రాజమౌళి కాంబోలో రానున్న బిగ్‌ ప్రాజెక్ట్‌ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. SSMB29 పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. 

SSMB29 ప్రాజెక్ట్‌ కోసం హాలీవుడ్‌ నటీనటులు కూడా భాగస్వామ్యం కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సినంత హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ సినిమాలో నటిస్తున్న వారికి రెమ్యునరేషన్‌ ఎంత ఇస్తున్నారు. వంటి అంశాల గురించి సోషల్‌మీడియాలో తెగ చర్చలు చేస్తున్నారు.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ​ మూవీ కోసం డైరెక్టర్‌ రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్​ గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఈ సినిమా కోసం రాజమౌళి ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోవడం లేదట. ఈ ప్రాజెక్ట్‌కు బదులుగా సినిమాలో వాటా తీసుకోబోతున్నారని ప్రచారం నడుస్తోంది. రాజమౌళి సినిమా కలెక్షన్స్‌ అంటే వందల కోట్ల కలెక్షన్స్‌ రాబట్టడం ఖాయం. ఈ లెక్కన సినిమాలో నటించే వారికంటే కూడా ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్‌ అందే ఛాన్స్‌ ఉంది. మహేశ్‌ బాబు కూడా సినిమా కోసం భారీ మొత్తంలో అందుకుంటున్నట్లు టాక్‌.. రెమ్యునరేషన్‌తో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో ఆయన కొంత వాటా తీసుకునే ఛాన్స్‌ ఉంది అని తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *