#Cinema #Movies

Kangana’s interest in South movies సౌత్ సినిమాలపై కంగన ఇంట్రెస్ట్ .. అదే కారణమా?

కంగనా రనౌత్‌ పేరు చెప్పగానే ఆమె సినిమాల కంటే వివాదాలే ఎక్కువగా గుర్తొస్తాయి. తెలుగులో ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’, తమిళంలో పలు సినిమాలు చేసినప్పటికీ.. హిందీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య ఎందుకో ఈమెకి అస్సలు కలిసి రావడం లేదు. హిందీలో తీసిన ప్రతి సినిమా కూడా ఘోరమైన ఫ్లాప్స్‌గా నిలిచాయి.

మరోవైపు కంగన.. తమిళంలో తలైవి, చంద్రముఖి 2 లాంటి చిత్రాల్లో నటించింది. యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చినప్పటికీ.. రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు మరో తమిళ సినిమాకు కంగన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. గతంలో కంగనతో ‘తలైవి’ తీసిన డైరెక్టర్ ఏఎల్‌ విజయ్‌.. ఇప్పుడు తన కొత్త మూవీలోనూ కంగననే తీసుకున్నట్లు సమాచారం. మాధవన్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే జరుగుతోందట. అలానే కంగన హీరోయిన్‌గా ఫిక్స్ అయిన విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు హిందీ సినిమాలు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా దక్షిణాది నుంచి వస్తున్నాయి. బహుశా కంగన కూడా హిందీ కంటే సౌత్ చిత్రాలు చేయడానికి అందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుందా అనే సందేహం వస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *