Stones are left..! – రాళ్లు మిగిలాయి..!

దంతాలపల్లి, మహబూబాబాద్: ప్రకృతి విలయతాండవం చేసింది. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీవర్షాలకు రైతన్న అతలాకుతలమయ్యారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రాళ్లురప్పలతో సాగుభూమి పనికి రాకుండా పోయింది. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన వీరబోయిన భిక్షం తనకున్న 5 ఎకరాల్లో వరి వేశారు. కుమ్మరికుంట్ల శివారులోని పెద్దచెరువు మత్తడి ఉద్ధృతితో ఒక్కసారిగా కట్ట తెగి సమీపంలోని పొలం మునిగిపోయింది. మూడు ఎకరాలు నామరూపాలు లేకుండా పోయింది. పొలంలో రాళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని తొలగించడానికి రూ.మూడు లక్షలు వ్యయమవుతుందని.. భరించలేకనే ఖాళీగా వదిలేశానని ఆవేదన వ్యక్తం చేశారు.