Kamareddy – రూ.25 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.

ఎల్లారెడ్డి;పత్తి చేను మధ్యలో పెంచిన రూ.25 లక్షలు విలువ చేసే గంజాయి మొక్కలను ప్రొహిబిషన్, ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎక్సైజ్ ఎస్పీ రవీందర్ రాజ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీటీఎఫ్ స్క్వాడ్‌తో కలిసి గాంధారి మండలం అవుసులకుంట తండాకు చెందిన ధరావత్ జైత్రం తన పత్తి పొలంలో గంజాయిని పెంచుతున్నట్లు గుర్తించారు. దాదాపు రూ.25 లక్షలు విలువ చేసే 232 మొక్కలను స్వాధీనం పరుచుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, పట్టుకుని కేసు నమోదు చేస్తామన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయాలు జరిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు సుందర్‌సింగ్, షాకీర్ అహ్మద్, ఎస్సైలు మమత, జమీలుద్దీన్, సిబ్బంది ఉన్నారు