#International news

Vivek Ramaswamy – అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక్ రామస్వామి వేగంగా దూసుకుపోతున్నారు

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో వివేక్‌ రామస్వామి వేగంగా పుంజుకొంటున్నారు. ట్రంప్‌ తర్వాతి స్థానంలోకి ఆయన చేరుకొన్నారు. ఇటీవల నిర్వహించిన జీవోపీ పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం.. రామస్వామి మూడోస్థానం నుంచి ద్వితీయస్థానానికి ఎగబాకినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఈ రేసు కోసం జరుగుతున్న ప్రాథమిక పోల్స్‌లో 39 శాతం మంది మద్దతుతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రథమస్థానంలో కొనసాగుతున్నారు. 13 శాతం మద్దతుతో వివేక్‌ రామస్వామి ద్వితీయస్థానానికి చేరుకున్నారు. దీంతో ట్రంప్‌కు ఆయనే ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశముంది. భారత సంతతికి చెందిన మహిళా అభ్యర్థి నిక్కీహెలీ 12 శాతం ఓట్లతో తృతీయస్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ట్రంప్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డీశాంటిస్‌ రెండు స్థానాలు దిగజారి.. అయిదో స్థానానికి పడిపోవడం గమనార్హం. గత జులైలో 26 శాతం ఓటర్ల మద్దతుతో ద్వితీయస్థానంలో ఉన్న డిశాంటిస్‌ ప్రస్తుతం కేవలం 6 శాతం మద్దతుకే పరిమితమయ్యారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ 11 శాతం మద్దతుతో నాలుగోస్థానంలో ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *