United States of America (USA) – టర్కీకి చెందిన డ్రోన్‌ను కూల్చివేసింది

పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో(NATO) సభ్యదేశం తుర్కియే(Turkey)కు చెందిన డ్రోన్‌ను అమెరికా(USA) కూల్చివేసింది. సిరియా(Syria)లో మోహరించిన అమెరికా బలగాలు.. తమ క్యాంప్ వైపునకు డ్రోన్ రావడంతో ముప్పుగా భావించి యూఎస్ ఫైటర్ జెట్లతో కూల్చివేశాయి. ఈ విషయాన్ని పెంటగాన్ వెల్లడించింది. నాలుగు రోజుల క్రితం అంకారాలోని తుర్కియే పార్లమెంట్ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు తామే బాధ్యులమని కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ ప్రకటించింది. దీంతో తుర్కియే బలగాలు ఇరాన్, సిరియాల్లో కుర్దిష్ దళాలపై వైమానిక దాడులు చేస్తోంది.
గురువారం ఈశాన్య సిరియాలో తుర్కియే కొన్ని డ్రోన్లతో దాడులు చేసింది. ఈ క్రమంలో వాటిలో కొన్ని అమెరికా మిలిటరీ క్యాంపు ఉన్న హసాకా సమీపంలోని నిషేధిత ఆపరేటింగ్ జోన్‌లోకి వచ్చాయి. బలగాలు ఉన్న ప్రాంతం నుంచి సుమారు కిలో మీటరు దూరం వరకు వచ్చి వెళ్లాయి. అయితే కొన్ని గంటల తర్వాత ఒక డ్రోన్ ఆ నిషేధిత జోన్‌లోకి మళ్లీ ప్రవేశించింది. దీంతో ముప్పుగా పరిగణించిన అమెరికా బలగాలు ఫైటర్‌జెట్-16తో డ్రోన్‌ను కూల్చివేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా అమెరికా బలగాలు సిరియాలో క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి. సుమారు 900 మంది సైనికులు అక్కడ ఉన్నారు.