Trump Jr.’s -ట్రంప్ జూనియర్ ఖాతా హ్యాక్ చేయబడింది

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కనిపించింది. దీనికి కారణం ట్రంప్ తనయుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఈ పోస్ట్ వచ్చింది.అయితే అతని ఖాతా హ్యాక్ అయినట్లు ఆలస్యంగా తెలిసింది. “నా తండ్రి ట్రంప్ మరణించారని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాను. 2024 ఎన్నికల్లో నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తాను” అని హ్యాకర్లు ఆ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే ఖాతా నుండి, ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్‌ను అవమానించే అనేక పోస్ట్‌లు కూడా కనిపించాయి. అయితే, ట్రంప్ జూనియర్ ఖాతా హ్యాక్ అయినట్లు ఆ తర్వాత తెలిసింది. కొంతకాలం తర్వాత పాత పోస్ట్‌లు తొలగించబడ్డాయి.