#International news

tight – competition – ప్రస్తుత, మాజీ అధ్యక్షుల మధ్య గట్టి పోటీ నెలకొంది

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికా(America)లో ఇప్పటికే పార్టీల ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)నకు తిరుగులేదని తెలుస్తోంది. తన పార్టీలోనే కాకుండా ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) కంటే కూడా ఆయనే ముందు వరుసలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. వాషింగ్టన్‌ పోస్టు, ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్‌ సర్వేలో బైడెన్‌(Biden) కంటే ట్రంప్‌ దాదాపు 10 పాయింట్లు ముందున్నట్లు తేలింది. వారికొచ్చిన పాయింట్లు 51-42గా ఉన్నాయి.

మరోసారి అధ్యక్షుడిగా పనిచేసే విషయంలో బైడెన్‌(Joe Biden) వయసు మళ్లిన వ్యక్తిలా కనిపిస్తున్నారని, ఆయన కంటే ట్రంప్‌ మెరుగ్గా ఉన్నారంటూ సర్వేలో అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ సర్వేను పలువురు రాజకీయ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల రేసులో ఇద్దరు ఒకేస్థాయిలో దూసుకెళ్తున్నారని ఇతర సర్వేలు వెల్లడిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్‌ ముందువరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తర్వాతి స్థానం భారత సంతతి నేత వివేక్‌ రామస్వామిదే. మరో భారత సంతతి నేత నిక్కీ హేలీ గట్టి పోటీ ఇస్తున్నారు. వీరి నుంచి ఇంత పోటీ ఉన్నా.. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధికారిక అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *