Theft at an international airport – అంతర్జాతీయ విమానాశ్రయంలో చోరీ..

ఓ ఇంటర్ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఏకంగా సిబ్బందే చోరీకి పాల్పడ్డారు. అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ( Miami International Airport)లో ఈ ఘటన చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..
సెక్యూరిటీ స్కానర్ మెషిన్‌పై ఉంచిన ప్రయాణికుల బ్యాగుల నుంచి కొన్ని వందల డాలర్లు సహా వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి. ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA)లో పనిచేసే ఇద్దరు వ్యక్తులే ఈ చోరీకి పాల్పడ్డారు. జోసు గొంజాలెజ్(20), లాబారియస్ విలియమ్స్(33)లు ఎయిర్‌పోర్టులో టీఎస్‌ఏ సిబ్బందిగా ఉన్నారు. అయితే, ప్రయాణికులు స్కానర్ మెషిన్‌పై తమ లగేజినీ వదిలి వెళ్లాక.. తనిఖీ చేస్తున్నట్లుగా నటకమాడి బ్యాగుల నుంచి డాలర్లు, వస్తువులను కాజేసి తమ జేబుల్లో పెట్టుకున్నారు.
ప్రయాణికుల వస్తువులు కనిపించకపోవడంతో.. అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించగా సిబ్బందే చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో వారిని ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వీరిద్దరిని అరెస్టు చేశారు. నిందితులను విచారించగా దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించారు. అయితే, రోజుకు కనీసం 600 నుంచి 1000 డాలర్ల వరకు చోరీ చేసేవారమంటూ నిందితులు తెలిపారు. ‘‘ఇలాంటి చర్యలను మేము సహించం. చోరీకి పాల్పడిన వారిని ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించాం’’ అని టీఎస్‌ఏ ఓ ప్రకటనలో తెలిపింది.