The roof of the church collapsed – చర్చి పైకప్పు కూలిపోయింది

ఉత్తర మెక్సికోలోని తామౌలిపాస్ రాష్ట్రం సియుడాడ్ మాడెరో నగరంలో శాంతాక్లజ్ చర్చిలో ఆదివారం బాప్టిజం కార్యక్రమం జరుగుతున్న సమయంలో దాని పైకప్పు కూలి సుమారు 10 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. మరో 60 మంది గాయపడ్డారు. 23 మందిని ఆసుపత్రుల్లో చేర్చగా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని భద్రతా దళ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ శిథిలాల మధ్య చిక్కుకున్న బాధితులను గుర్తించేందుకు సహాయ సిబ్బంది గాలింపు నిర్వహించారని అధికారులు వెల్లడించారు. జీవించి ఉన్నవారిని గుర్తించేందుకు శునకాలను ఉపయోగించారు. పైకప్పు కూలే సమయానికి దాని కింద సుమారు 100 ఉన్నారని పోలీసులు తెలిపారు. నిర్మాణపర లోపాలతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మెక్సికన్ కౌన్సిల్ ఆఫ్ బిషప్స్.. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసింది.