The plane descended 28 thousand feet within 10 minutes.. – 10 నిమిషాల్లోనే 28 వేల అడుగుల కిందికి దిగిన విమానం..

విమానం (Flight) గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రయాణికులకు అనూహ్య అనుభవం ఎదురైంది. 10 నిమిషాల వ్యవధిలో విమానం 28 వేల అడుగులు కిందికి దిగిరావడంతో అందులోని వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
యునైటెడ్ ఎయిర్‌లైన్స్( United Airlines)కు చెందిన విమానం(Flight) 270 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి రోమ్‌కు బయలుదేరింది. కానీ, ఆ తర్వాత కొద్ది గంటలకే టేకాఫ్ అయిన చోటే ల్యాండ్ అయింది. గాల్లోకి లేచిన కొద్దిసేపటికే విమానంలో పీడనానికి సంబంధించిన సమస్య (pressurisation) తలెత్తడాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలోనే విమానాన్ని వీలైనంత త్వరగా కిందికి దించి, వెనక్కి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు. దానిలో భాగంగానే విమానం 10 నిమిషాల వ్యవధిలో 28 వేల అడుగులు కిందికి దిగిపోయినట్లు ఫ్లైట్ అవేర్ డేటాను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెల్లడించాయి. బుధవారం ఈ ఘటన జరిగింది.
ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చామని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఇదివరకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన ప్రయాణికులు కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. మార్గమధ్యంలో 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా పీడన సమస్య తలెత్తడంతో..ఆ విమానం కేవలం మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల కిందికి దిగిపోయింది. చివరకు విమానం క్షేమంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.