#International news

The Head Of Tesla Who Once Again Spoke Against Taiwan – తైవాన్ కు వ్యతిరేకంగా మరోసారి మాట్లాడిన టెస్లా అధిపతి తీవ్ర ప్రతిస్పందనను ఎదుర్కొన్నాడు

చైనా (China) పక్షాన మాట్లాడుతూ తైవాన్‌(Taiwan)పై మరోసారి నోరు పారేసుకొన్న టెస్లా అధినేతకు ఘాటు జవాబు ఎదురైంది. మాకు సలహాలు చెప్పే బదులు చైనాలో నీ సంగతేమిటో చూసుకో అన్నట్లు తైవాన్‌ జవాబు చెప్పింది. ఇటీవల జరిగిన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఆల్‌-ఇన్‌ సదస్సులో ఎలాన్‌ మస్క్‌ (Elon Musks) రిమోట్‌ విధానంలో ప్రసంగించారు. అమెరికాకు హవాయి వలే చైనాకు తైవాన్‌ అని వ్యాఖ్యానించారు. ‘‘నాకు బాగా తెలుసు.. తైవాన్‌ను చైనాలో విలీనం చేసుకొనేలా బీజింగ్‌ విధానాలు ఉంటాయి. వారి దృక్కోణంలో మనం హవాయిని ఇష్టపడటం వంటిది లేదా.. వారిలో అంతర్భాగమైనా.. విలీనం కాకుండా అసమగ్రంగా ఉండిపోయింది. విలీనానికి జరిగే ఏ ప్రయత్నాన్ని అయినా అమెరికా పసిఫిక్‌ దళం అడ్డుకొంటుంది’’ అని వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలకు తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసఫ్‌ వూ తీవ్రంగా స్పందించారు. ‘‘శ్రద్ధగా వినండి.. తైవాన్‌ పీఆర్‌సీలో భాగం కాదు. అలాగని అమ్మకానికి లేదు. మీరు ఎక్స్‌ (ట్విటర్‌)ను చైనాలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురమ్మని సీసీపీని కోరతారని నేను ఆశిస్తున్నా’’ అని ఎద్దేవా చేశారు. చైనాలో ప్రజలు ట్విటర్‌ను వినియోగించకుండా అధికారులు బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే చైనా నాయకత్వంతో రాసుకుపూసుకు తిరుగుతారనే పేరు మస్క్‌కు ఉంది. టెస్లా సహా పలు వ్యాపారాలు అక్కడ ఉన్నాయి.  ఈ నేపథ్యంలో ఆ దేశ అమెరికా వ్యాపారాల గురించి అడిని ప్రశ్నకు మస్క్‌ తైవాన్‌ను ఉదాహరణతో చెప్పాడు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. తాను ఎన్నోసార్లు చైనాలో పర్యటించానని, ఆ దేశంపై మంచి అవగాహన ఉందని మస్క్‌ పేర్కొన్నారు. గతంలో కూడా మస్క్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేసి తైవాన్‌కు ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే.

The Head Of Tesla Who Once Again Spoke Against Taiwan – తైవాన్ కు వ్యతిరేకంగా మరోసారి మాట్లాడిన టెస్లా అధిపతి తీవ్ర ప్రతిస్పందనను ఎదుర్కొన్నాడు

Nipah Virus Is Creating A Stir In

Leave a comment

Your email address will not be published. Required fields are marked *