#International news

Test-fired – ఖండాంతర క్షిపణిని పరీక్షించిన రష్యా

అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. సరికొత్త అణు జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉక్రెయిన్‌ అంశంపై పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో రష్యా ఈ చర్యకు దిగడం గమనార్హం. ఇప్పటికే అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు పుతిన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఒక బిల్లుపై ఇటీవల సంతకం చేశారు. అమెరికాతో సమాన స్థాయిని సాధించడానికి ఇది అవసరమని రష్యా పేర్కొంది. తాజా పరీక్షలో బులావా అనే క్షిపణిని ‘ఇంపరేటర్‌ అలెగ్జాండర్‌-3’ అనే జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. ఆ అస్త్రం.. కంచత్కా ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణశాఖ పేర్కొంది. ఇంపరేటర్‌ అలెగ్జాండర్‌-3.. బొరెయ్‌ తరగతికి చెందిన జలాంతర్గామి. అది 16 బులావా క్షిపణులను మోసుకెళ్లగలదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *