Singapore – విమానానికి బాంబు బెదిరింపు

సింగపూర్‌కు చెందిన ‘స్కూట్’ విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు హడలెత్తించాడు. దాంతో ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లాల్సిన ఆ విమానాన్ని ఫైటర్ జెట్ల సాయంతో తిరిగి సింగపూర్‌కు మళ్లించారు. 374 మందితో సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకు ఆ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన గంట తరవాత బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు బెదిరించాడు. సమాచారం అందుకున్న సింగపూర్ వాయుసేన రెండు యుద్ధ విమానాలను పంపింది. అవి విమానాన్ని సింగపూర్‌కు మళ్లించాయి. విమానాశ్రయంలో దిగాక జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కన్పించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు కారణమైన ఆస్ట్రేలియా దేశస్థుడిని అదుపులోకి తీసుకున్నారు.